ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయండి ! నిరుద్యోగుల చావులను ఆపండి!!

నియామకాల జై తెలంగాణ

తెలంగాణ ఉద్యమం మొదలైందే నియామకాల కోసం. తెలంగాణ వస్తేనే ఉద్యోగాలు వస్తాయి అని తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొన్నారు. తెలంగాణ వచ్చింది కానీ ఏడేండ్లలో నోటిఫికెషన్స్ లేవు .. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఇప్పటికి ఉద్యోగాల కోసం వందల మంది నిరుద్యోగులు చనిపోతూనే ఉన్నారు. గత ఉమ్మడి రాష్ట్రంలో కల్పించిన ఉద్యోగాల కంటే ఇప్పుడు పరిస్థితి ఇంకా దిగజారింది. తెలంగాణ ప్రభుత్వ లెక్కల ప్రకారం 5 లక్షల మంది ఉద్యోగులు అవసరమైతే ప్రస్తుతం మన దగ్గర ఉన్నది మాత్రం కేవలం 3 లక్షల 9 వేల మంది మాత్రమే ఉన్నారు. ఇంకా లక్ష 91 వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉన్న ప్రభుత్వం మాత్రం నోటిఫికెషన్స్ మాత్రం ఇవ్వటం లేదు.

ఖాళీగా ఉన్న ఉద్యోగాలు

39 డిపార్ట్మెంట్ లలో మొత్తం ఉండాల్సిన ఉద్యోగులు – 5, 00,666
ఇప్పుడు ఉన్న ఉద్యోగులు - 309000
మొత్తం ఖాళీలు – 191000

ఖాళీగా ఉన్న ఉద్యోగాలు

నెరవేర్చని వాగ్దానాలు

రాష్ట్రం ఏర్పడేటప్పటికి ఖాళీగా ఉన్న పోస్టులు, ఆ తర్వాత ఏటా రిటైర్ అవుతున్న వారితో కలిపి దాదాపు 3లక్షలకు పైనే ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ 110నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేసింది కేవలం 35,724 ఉ ద్యోగాలు మాత్రమే.
ఉద్యోగాలు లేనివారికి నిరుద్యోగ భృతి కల్పిస్తామని 2018 2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ హామీని రెండున్నరేండ్లుగా అమలు చేయలేదు. నిరుద్యోగ యువతకు రూ.3,016చొప్పున ఇస్తామంటూ 2019–20 బడ్జెట్‌‌లో రూ.1810కోట్లు కేటాయించారు. ఆ తర్వాత 2020–21, 2021–22 బడ్జెట్లలో  నిరుద్యోగ భృతి ప్రస్తావనేలేదు. యువతకు పైసా అందలేదు. ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగ భృతిని చెల్లించాలి.

నిరుద్యోగ అమరవీరులు

కొండల్ .. వనపర్తి .. గ్రామం. తాడిపత్రి.  ఉద్యోగ నోటిఫికెషన్స్ లేక ఉద్యోగం సాధించలేక .. మానసికంగా, శారీరకంగా దెబ్బతిన్నానని, బయట ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావని అడిగితే చెప్పలేక .. ఇతరులకు మొఖం చూపించలేక చివరకు ఆత్మహత్య చేసుకొంటున్నాని చనిపోయిండు. నాగేశ్వర్ రావ్ .. ఖమ్మం .. సత్తుపల్లి .. పెనుబల్లి గ్రామం .. ఒకవైపు  ఉద్యోగం లేక .. నోటిఫికెషన్స్ ఎప్పుడు వస్తాయో అని ఎదురుచూస్తూ .. సమాజంలో చిన్న చూపు చూస్తుంటే భరించలేక పోయిండు.

నాగేశ్వర్ రావ్ .. ఖమ్మం .. సత్తుపల్లి .. పెనుబల్లి గ్రామం .. ఒకవైపు ఉద్యోగం లేక .. నోటిఫికెషన్స్ ఎప్పుడు వస్తాయో అని ఎదురుచూస్తూ .. సమాజంలో చిన్న చూపు చూస్తుంటే భరించలేక పోయిండు.

నిరుద్యోగ అమరవీరులు

త్వరలో, త్వరలో ఉద్యోగాల వస్తున్నాయి అని ఏళ్ళుగా చెప్తున్నా ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవటం వల్ల మనస్తాపానికి గురైకొట్టుముల వెంకటెష్ (23) ఆత్మహత్య చేసుకున్నాడు.  ఉద్యోగాలు రాక ఊర్లల్లో తలెత్తుకోలేక, ఊర్లో వాళ్ళ పెళ్ళెప్పుడు అనే సూటి పోటి మాటలను, అవమానాలు తట్టుకోలేక యూనివర్సిటీ హాస్టల్స్ లో కొంపల్లి నర్సయ్య (44)ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కోసం ఏళ్ళకు,ఏళ్ళు ఎదురు చూసి,చూసి మరో వైపు కుటుంబాన్ని పోషించలేక చివరికి నిరాశతో గుగులోత్ రవిందర్ (33) ఆత్మహత్య చేసుకొన్నాడు.  “బ్రతక లేక చావడం లేదు, కనీసం నా చావుతోనైన ఉద్యోగాలు వస్తాయని నమ్మి ఆత్మహత్య చేసుకుంటున్నాను” అని చెప్పి బోడ సునీల్ నాయక్ (33) ఆత్మ హత్య చేసుకున్నాడు.

ఒక వైపు వయస్సు అయిపోతుంటే, ఉద్యోగానికి  అనర్హుడునై పోతాననే భాధ, మానసిక క్షోభతో అవే ఆలోచనలతో మతిస్థిమితం కోల్పోయి భూమేష్ (35) ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగ నోటిఫికేషన్ రాక ఇంటికి పోతే కుటుంబానికి ఎక్కడ భారమైతా అనే ఆవేదనతో యూనివర్సిటీ లో నే మురళి (30) ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రభుత్వ నోటిఫికేషన్ ల కోసం ఎదురు చూసి చూసి మాలాంటి నిరుద్యోగులను ప్రభుత్వం పట్టించుకోదని ఆవేదన చెంది రామ్మోహన్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి నిరుద్యోగ ఆత్మహత్యలు ఆపాలంటే వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి.  నిరుద్యోగులకు ఉపాధి దొరకాలంటే డిమాండ్లను  వెంటనే నెరవేర్చాలి.

నిరుద్యోగ ఆత్మహత్యలు ఆపాలంటే

ఇలాంటి నిరుద్యోగ ఆత్మహత్యలు ఆపాలంటే వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. నిరుద్యోగులకు ఉపాధి దొరకాలంటే డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ..

  1. ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికెషన్స్ ప్రకటించాలి.
  2. కొత్త జిల్లాలకు .. మండలాలకు అవసరపడే నూతన సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలి.
  3. 54 లక్షల మంది నిరుద్యోగ యువతకు నైపుణ్యాలు పెంచే పథకాలను వెంటనే చేపట్టి వారి ఉపా ధి అవకాశాలు కల్పించాలి.
  4. బిసి, ఎస్సి, ఎస్టి మైనార్టీ కార్పొరేషన్లలో లోన్ ల కోసం దరఖాస్తు పెట్టుకున్న 10 లక్షల అప్లికేషన్స్ కు వెంటనే లోన్స్ అందచేయాలి.
  5. నిరుద్యోగులకు చెల్లిస్తానన్న నిరుద్యోగ భృతి 3016 రూపాయలను వెంటనే చెల్లించాలి.

ఈ డిమాండ్లను వెంటనే పరిష్కరించి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాలని మేము ముఖ్యమంత్రి కెసియార్ గారిని డిమాండ్ చేస్తున్నాం.